

బిగ్ బాస్ తెలుగు 10 తొలి వారం నామినేషన్ ఓటింగ్ ఆసక్తికరంగా మారింది. హౌస్‌లో ఉన్న మొత్తం 16 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉండటంతో ఎవరు ప్రేక్షకుల మద్దతు పొందుతున్నారు, ఎవరు వెనుకబడుతున్నారు అనే దానిపై చర్చ మొదలైంది. నామినేషన్స్ ప్రక్రియ షో ప్రారంభమైన వెంటనే జరగడంతో తొలి రోజు ఓటింగ్‌పై కంటెస్టెంట్లకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మొదటి ఇంప్రెషన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
తొలిరోజు ఓటింగ్ ట్రెండ్ ప్రకారం రోహిత్ నాయుడు 20 శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ముఖేష్ గౌడ 18 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, రామ్ ప్రసాద్ 10 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అమన్ మసూద్‌కు 8 శాతం, త్రిగుణ్, కృష్ణుడికి చెరో 7 శాతం ఓట్లు వచ్చినట్లు ట్రెండ్ చెబుతోంది. ఝాన్సీ, దేబ్జానీ 6 శాతం చొప్పున, జబర్దస్త్ నరేష్ 5 శాతం, వర్షిణి 4 శాతం, టెంపర్ వంశీ 3 శాతం ఓట్లతో ఉన్నారు.
చరణ్, షాలిని, చైత్ర రాయ్‌లకు చెరో 2 శాతం ఓట్లు రాగా, సృష్టి, యాంకర్ సుధీర్ చెరో 1 శాతం ఓట్లతో చివరి స్థానాల్లో ఉన్నారు. అయితే ఇది కేవలం తొలిరోజు ఓటింగ్ ట్రెండ్ మాత్రమే. రాబోయే టాస్కులు, కంటెస్టెంట్ల ఆటతీరు, హౌస్‌లో వారి ప్రెజెన్స్, వివాదాలు వంటి అంశాల ఆధారంగా ఓటింగ్ పూర్తిగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రోహిత్, ముఖేష్ టాప్‌లో ఉండగా.. సృష్టి, సుధీర్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!