

బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ గ్రాండ్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు ఈ షో ప్రారంభం కానుండటంతో కంటెస్టెంట్ల ఎంట్రీపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా, సినీ వర్గాల్లో పలువురు సెలబ్రిటీల పేర్లు చక్కర్లు కొడుతుండగా, తాజాగా మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది. దీంతో బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాపై మరింత ఆసక్తి నెలకొంది.
పరిశ్రమలో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. ‘టెంపర్’ వంశీగా గుర్తింపు పొందిన నటుడు ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయన అసలు పేరు అజయ్. జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం పలు సినిమాల్లో విలన్, సహాయ నటుడిగా కనిపించారు. ఇక ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేష్, జ్యోతి, యూట్యూబర్ నందూ, రచయిత కడలి సత్యనారాయణ తదితరుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే వీరిలో ఎవరు నిజంగా హౌస్‌లోకి వెళ్తారనేది సెప్టెంబర్ 6న జరిగే గ్రాండ్ లాంచ్‌లోనే అధికారికంగా స్పష్టమవుతుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!