

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుండటంతో ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ‘అగ్నిపరీక్ష’ ద్వారా నలుగురు సామాన్యులను ఎంపిక చేసినట్లు సమాచారం. సెలబ్రిటీల జాబితాలో సీరియల్ నటీమణులు పల్లవి గౌడ, తేజస్విని, కావ్యశ్రీ, కమెడియన్లు ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేశ్, డ్యాన్సర్ ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందూ, రచయిత కడలి సత్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి.
తాజాగా వంశీ కూడా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారో తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఈ నెల 6 నుంచి స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుంది. తొలిరోజు సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ప్రారంభం కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!