

బిగ్ బాస్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలో పలు ఊహించని ట్విస్టులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అమన్ ఫైనల్ లిస్ట్‌లో ఉండటం కష్టమేనని చాలామంది భావించినప్పటికీ, అందరికంటే ముందుగానే అతడిని ఎంపిక చేసినట్లు సమాచారం. అత్యధిక ఓట్లు అమన్‌కే వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అగ్నిపరీక్ష జడ్జిగా వ్యవహరించిన అభిజిత్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు హాజరుకాలేదని తెలుస్తోంది.
బిందు మాధవి తన సీజన్ 10 జ్యూరీ పవర్‌తో రోహిత్ నాయుడిని ఎంపిక చేసి, అతడిని బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే శ్రీముఖి ఝాన్సీని హౌస్‌లోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నవదీప్ షాలినిని ఎంపిక చేయగా, శ్రీముఖి తన ప్రత్యేక అధికారంతో చివరి నిమిషంలో శృష్టి వ్యాకరణంను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. శృష్టి వ్యాకరణం నవదీప్ స్నేహితురాలు కావడంతో, షాలినికి బదులుగా ఆమెకు అవకాశం ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!