
రాజకీయాలు

‘ఎపిక్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ స్టేజ్‌పై సందడి చేయనున్నట్లు సమాచారం. షో ప్రారంభ వేడుకలో వీరిద్దరూ పాల్గొని తమ సినిమాను ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అలాగే ‘సర్దార్ 2’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో కార్తీక్ కూడా బిగ్ బాస్ స్టేజ్‌పై కనిపించనున్నట్లు సమాచారం. ‘ఊపిరి’ సినిమాలో నాగార్జున, కార్తీక్ కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. గతంలోనూ తన సినిమా ప్రమోషన్స్ కోసం కార్తీక్ బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చారు. ఇప్పుడు పదో సీజన్ ప్రారంభంలోనే మరోసారి ఆయన బిగ్ బాస్ వేదికపై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!