

బిగ్ బాస్ రియాలిటీ షోలో హోస్టులు ప్రధానంగా వీకెండ్ ఎపిసోడ్లలోనే కనిపించినప్పటికీ, షోను ముందుకు నడిపించడంలో వారి పాత్ర కీలకంగా ఉంటుంది. కంటెస్టెంట్ల తప్పొప్పులను ఎత్తిచూపడం, వారికి సూచనలు ఇవ్వడం, అవసరమైన సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాల్లో హోస్టులు కీలకంగా వ్యవహరిస్తారు. సెప్టెంబర్ 6 నుంచి తాజా తెలుగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వివిధ భాషల బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. మీడియా కథనాల ప్రకారం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హోస్ట్‌గా ఉన్నారు. ఒక్కో వీకెండ్ ఎపిసోడ్‌కు రూ.15 కోట్లకు పైగా, ఒక సీజన్‌కు సుమారు రూ.125 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సమాచారం. తమిళ హోస్ట్ విజయ్ సేతుపతి సుమారు రూ.75–80 కోట్లు, తెలుగు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున్ రూ.35–40 కోట్ల వరకు అందుకుంటున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు మలయాళ బిగ్ బాస్ హోస్ట్ మోహన్‌లాల్‌కు సుమారు రూ.30 కోట్లు, కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్‌కు దాదాపు రూ.20 కోట్ల వరకు పారితోషికం అందుతున్నట్లు సమాచారం. మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈసారి తొలిసారిగా బిగ్ బాస్ బెంగాలీకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో నాలుగేళ్లకు సుమారు రూ.125 కోట్ల విలువైన ఒప్పందం కుదిరినట్లు కూడా మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే ఈ పారితోషికాలకు సంబంధించి షో నిర్వాహకులు లేదా సంబంధిత హోస్టుల నుంచి అధికారిక ధృవీకరణ లేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!