

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. పదో సీజన్ కావడంతో ఈసారి షోను మరింత ప్రత్యేకంగా ఉండేలా రూపొందిస్తున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రోమోల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా కామనర్లను అగ్నిపరీక్ష పేరుతో వడపోస్తూ కొందరిని ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతోంది.
ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే బుల్లితెర నటులతో పాటు పలువురు సినీ నటులు కూడా ఈసారి హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా నటుడు ఆదిత్ అరుణ్ బిగ్‌బాస్ సీజన్ 10లో పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. సెప్టెంబర్‌లో షో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఖచ్చితమైన తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!