

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ నాగార్జున హోస్టింగ్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈసారి సరికొత్త హౌస్ డిజైన్, ప్రత్యేకమైన కీ కాన్సెప్ట్‌తో షోను రూపొందించారు. సెలబ్రిటీలతో పాటు కామనర్లకు కూడా అవకాశం కల్పించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 16 మంది కంటెస్టెంట్లు వరుసగా ఇలా ఉన్నారు:
దేబ్జానీ మోదక్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో తొలి కంటెస్టెంట్‌గా దేబ్జానీ మోదక్ ఎంట్రీ ఇచ్చారు. ‘ఛాంపియన్’ సినిమాలోని ‘గిర్ర గిర్ర గిర్ర గింగిరానివే’ పాటకు పవర్‌ఫుల్ స్టెప్పులతో ఆమె గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
త్రిగుణ్
రెండో కంటెస్టెంట్‌గా నటుడు త్రిగుణ్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ‘ది ప్యారడైజ్’ సినిమాలోని ‘ఆయా షేర్’ పాటతో స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా పలు సినిమాలు చేశానని, ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ప్రతి ఇంటికీ చేరాలని కోరుకుంటున్నానని తెలిపారు. తన ఏడాది వయసున్న కుమార్తెకు యుకీ అని పేరు పెట్టినట్లు చెప్పారు.
ఝాన్సీ
ఫోక్ సింగర్ ఝాన్సీ బిగ్ బాస్‌లోకి తొలి కామనర్‌గా ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో బిగ్ బాస్‌పై ఫోక్ సాంగ్ పాడుతూ వేదికపై సందడి చేశారు. ఈ షో ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సుధీర్ రెడ్డి
నాలుగో కంటెస్టెంట్‌గా సుధీర్ రెడ్డి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలను ఏవీ ద్వారా ప్రేక్షకులకు చూపించారు. పని మీద నమ్మకంతో ముందుకు సాగానని, అదే తనను బిగ్ బాస్ వేదిక వరకు తీసుకొచ్చిందని తెలిపారు. యూట్యూబ్‌లో సుధీర్ రెడ్డికి సుమారు 1.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. తన బిగ్గెస్ట్ క్రష్ అనుష్క శెట్టి అని వెల్లడించారు.
అమన్
ఐదో కంటెస్టెంట్‌గా అమన్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అమన్‌ను కామనర్‌గా పరిచయం చేశారు. నాగార్జున అతనికి ఒక స్వీట్ మెమొరీగా టీ-షర్ట్‌ను అందించారు. అయితే ఆ టీ-షర్ట్‌కు కొన్ని హోల్స్ ఉండటంతో, వచ్చే వారం వరకు అందులో ఎన్ని హోల్స్ ఉన్నాయో గుర్తించాలనే టాస్క్ ఇచ్చారు.
చైత్ర రాయ్
చైత్ర రాయ్ ఆరో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. తన 10 నెలల పాపను వదిలి బిగ్ బాస్‌లోకి వచ్చినట్లు ఆమె భావోద్వేగంగా తెలిపారు. ఒక నెగెటివ్ కామెంట్ తనను తీవ్రంగా బాధించిందని, ఆ అనుభవం తన జీవితంలో మార్పుకు కారణమైందని వెల్లడించారు.
ఆటో రాంప్రసాద్
ఏడో కంటెస్టెంట్‌గా ఆటో రాంప్రసాద్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలోని హుక్ స్టెప్ సాంగ్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తనదైన కామెడీ, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించారు.
శాలినీ
శాలినీ ఎనిమిదో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె షోలోకి వెళ్లిన మూడో కామనర్‌గా నిలిచారు. నవదీప్ శాలినీని బిగ్ బాస్ వేదికపైకి తీసుకొచ్చి ప్రేక్షకులకు పరిచయం చేశారు.
టెంపర్ వంశీ
తొమ్మిదో కంటెస్టెంట్‌గా టెంపర్ వంశీ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాతో వంశీకి మంచి గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ వేదికపై ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి పాటలకు డ్యాన్స్ చేస్తూ తన టాలెంట్‌ను ప్రదర్శించారు.
సృష్టి వ్యాకరణం
సృష్టి వ్యాకరణం పదో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. జ్యూరీ ఛాయిస్ ద్వారా శ్రీముఖితో కలిసి ఆమె వేదికపైకి వచ్చారు. తన ప్రత్యేకమైన పరిచయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
జబర్దస్త్ నరేష్
జబర్దస్త్ నరేష్ 11వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘పంజా’ సినిమాలోని ‘పాపారాయుడు’ పాటతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
చరణ్
చరణ్ 12వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు. కామనర్‌గా పరిచయమైన చరణ్ ప్రజల నుంచి వచ్చిన కంటెస్టెంట్లలో ఒకరిగా బిగ్ బాస్ హౌస్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
కృష్ణుడు
టాలీవుడ్ నటుడు కృష్ణుడు 13వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదివిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానని, ఆ తర్వాత ఫోటోగ్రఫీలో కూడా పనిచేశానని తన కెరీర్ ప్రయాణాన్ని వివరించారు. కెరీర్‌లో కీలక దశలో యాక్సిడెంట్ ఎదురైందని తెలిపారు.
వర్షిణి
వర్షిణి 14వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాలోని ‘బటర్‌ఫ్లై’ పాటకు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి తన స్టేజ్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు.
రోహిత్
రోహిత్ 15వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బిందు మాధవి రోహిత్‌ను వేదికపైకి తీసుకొచ్చారు. ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎంపికైన చివరి కామనర్‌గా రోహిత్‌ను పరిచయం చేశారు.
ముఖేష్ గౌడ
ముఖేష్ గౌడ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 16వ, చివరి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని ‘రై రై రారా’ పాటతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖేష్ గౌడ ఎంట్రీతో సీజన్ 10లో 16 మంది కంటెస్టెంట్ల లైనప్ పూర్తయింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!