
షోస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ హౌస్‌లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలపై చర్చలు ఊపందుకున్నాయి. పసుపు కుంకుమ, సావిత్రి, నిండు నూరేళ్ల సావాసం వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పల్లవి గౌడ ఈసారి బిగ్ బాస్‌లో పాల్గొననున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షో కోసం ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
గతంలో ఒప్పందాలకు సంబంధించిన వివాదాల కారణంగా కొంతకాలం తెలుగు బుల్లితెరకు దూరమైన పల్లవి గౌడ, అనంతరం మళ్లీ సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే దీనిపై షో నిర్వాహకులు లేదా పల్లవి గౌడ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!