
జనరల్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్ 6న జరగనున్న ఈ లాంచ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్ ఆది రెడ్డి ఓ వీడియో ద్వారా తన అంచనాలను వెల్లడించారు.
సీజన్ 10లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్న పలువురు సినీ, బుల్లితెర సెలబ్రిటీలు, యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్ల పేర్లను ఆయన ప్రస్తావించారు. గతంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ల విషయంలో ఆది రెడ్డి చెప్పిన అంచనాలు చాలావరకు నిజమయ్యాయని అభిమానులు గుర్తుచేస్తున్నారు. దీంతో ఆయన వెల్లడించిన ఈ జాబితాపై మరింత ఆసక్తి నెలకొంది. అయితే అధికారిక కంటెస్టెంట్ల జాబితాపై పూర్తి స్పష్టత గ్రాండ్ లాంచ్‌లోనే రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!