

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొత్తం 16 మంది కంటెస్టెంట్లతో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాన షోతో పాటు ‘బిగ్ బాస్ బజ్’ కూడా ఈసారి కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు శివాజీ మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. బిగ్ బాస్ తెలుగు 7లో తన ఆటతీరు, మాటతీరు, పంచ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శివాజీ.. గతంలో బిగ్ బాస్ బజ్‌లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను నేరుగా ప్రశ్నిస్తూ వారి నుంచి ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. తాజాగా కొత్త సీజన్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ‘ఇది ఆట కాదు.. వేట’ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో వారి తొలి ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ‘బిగ్ బాస్ బజ్’ కార్యక్రమాన్ని రూపొందించారు. గత సీజన్లలో రాహుల్ సిప్లిగంజ్, అరియానా, గీతూ రాయల్, అంబటి అర్జున్ తదితరులు ఈ షోకు హోస్ట్‌లుగా వ్యవహరించారు. అయితే శివాజీ వరుసగా హోస్ట్‌గా కొనసాగుతుండటం ప్రత్యేకతగా మారింది. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ బజ్ అన్‌ఫిల్టర్డ్ ఎపిసోడ్లు ప్రసారం కానున్నాయి. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రెండు వేర్వేరు సమయాల్లో టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ల ఇంటర్వ్యూలకు యూట్యూబ్, సోషల్ మీడియాలో ఉన్న డిమాండ్ దృష్ట్యా శివాజీ డైరెక్ట్ ప్రశ్నలు, హాట్ సీట్ శైలి ఈ సీజన్‌కు మరింత ఆసక్తిని తీసుకురావచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!