

సీరియల్ నటి చైత్ర రాయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ రియాలిటీ షోలో ఆరో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె, తన 10 నెలల పాపను సైతం వదిలి పోటీలో పాల్గొన్నారు. బుల్లితెరపై ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకున్న చైత్ర రాయ్ బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కువ రోజులు కొనసాగుతుందని పలువురు అభిమానులు భావించారు. అయితే, తొలి వారంలోనే ఆమె ఎలిమినేట్ కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చైత్ర రాయ్ మళ్లీ సీరియల్స్, టీవీ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. తాజాగా దసరా సందర్భంగా తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దిగిన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలు అభిమానులు, నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చైత్ర కూతుళ్లు ఎంతో ముద్దుగా ఉన్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అష్టా చెమ్మా, రాధా కళ్యాణం, ఒక్క క్షణం, తథాస్తు, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు వంటి సీరియల్స్‌తో ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. సినిమాల్లోనూ నటించిన చైత్ర, దేవరలో కూడా ఓ పాత్రలో కనిపించారు. ఆమె భర్త పేరు ప్రసన్న శెట్టి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!