

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు పలువురు కంటెస్టెంట్లకు ప్రత్యేక పవర్స్ ఇచ్చారు. ఈ పవర్స్ నామినేషన్స్, ఎలిమినేషన్, హౌస్ డ్యూటీలు, కెప్టెన్సీ వంటి కీలక అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో పోటీ మరింత ఉత్కంఠగా మారనుంది.
ఝాన్సీకి ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే పవర్ లభించింది. ఇప్పటికే ఉపయోగించిన పవర్ లేదా అడ్వాంటేజ్‌ను తిరిగి యాక్టివేట్ చేసే అవకాశం ముఖేష్‌కు దక్కింది. కృష్ణుడికి పవర్ స్విచ్ చేసే అవకాశం వచ్చింది. అతను మరో కంటెస్టెంట్‌తో పవర్స్ మార్చుకోవడంతో పాటు స్థానాలను కూడా మార్చుకోవచ్చు. అయితే ఎలిమినేషన్ సమయంలో ఈ పవర్‌ను ఉపయోగించలేడు.
శాలినీకి హౌస్ డ్యూటీ పెనాల్టీ పవర్ దక్కింది. దీని ద్వారా హౌస్ డ్యూటీలకు సంబంధించిన పెనాల్టీని విధించవచ్చు. శ్రిష్టికి ఓ కంటెస్టెంట్‌ను నామినేట్ చేసే పవర్ లభించింది. రామ్ ప్రసాద్‌కు సేఫ్ షీల్డ్ ఉండగా, దాని ద్వారా తనను లేదా మరో కంటెస్టెంట్‌ను నామినేషన్స్ నుంచి కాపాడుకోవచ్చు.
వంశీకి కెప్టెన్ రోడ్‌బ్లాక్ పవర్ లభించింది. దీని ద్వారా తనకు నచ్చిన కంటెస్టెంట్ కెప్టెన్‌గా మారకుండా గరిష్ఠంగా రెండు వారాల వరకు అడ్డుకోవచ్చు. ఇక నరేష్‌కు డబుల్ ఓట్ పవర్ దక్కింది. నామినేషన్స్ సమయంలో అతను ఎంచుకున్న కంటెస్టెంట్‌కు వేసే ఓటు రెండు ఓట్లుగా పరిగణించబడుతుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!