

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొలి రోజే ఇంట్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మిగిలిన మ్యాజికల్ కీస్ కోసం కంటెస్టెంట్లను ఎంపిక చేసే సమయంలో త్రిగుణ్, రోహిత్ నాయుడు మధ్య మాటల యుద్ధం జరిగింది. రోహిత్ వాటర్ టాస్క్‌లో పాల్గొనలేదనే విషయాన్ని త్రిగుణ్ పదేపదే ప్రస్తావించడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయి.
మ్యాజికల్ కీస్ సాధించిన కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ప్రత్యేక పవర్స్‌ను కేటాయించారు. త్రిగుణ్‌కు టేక్ ఓవర్ పవర్ లభించింది. దీని ద్వారా ఇతర కంటెస్టెంట్‌కు ఉన్న పవర్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది. ఝాన్సీకి ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే పవర్, ముఖేష్‌కు మరో కంటెస్టెంట్ పవర్‌ను రివర్స్ చేసే అవకాశం దక్కాయి. వర్షిణి, కృష్ణుడు, శాలినీ, శ్రిష్టి, రామ్ ప్రసాద్, నరేష్‌లకు కూడా ప్రత్యేక పవర్స్ లభించాయి.
ఇక హౌస్ మేట్స్‌గా మారేందుకు నిర్వహించిన ప్రక్రియలో టీమ్ లీడర్ల ఎంపిక కీలకంగా మారింది. త్రిగుణ్ విషయంలో పలువురు కంటెస్టెంట్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో మరోసారి వాగ్వాదం జరిగింది. చివరికి రామ్ ప్రసాద్ బ్లూ టీమ్‌కు, రోహిత్ నాయుడు రెడ్ టీమ్‌కు లీడర్లుగా ఎంపికయ్యారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!