

‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో రిషి పాత్రతో బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ముఖేష్ గౌడ బిగ్ బాస్ తెలుగు 10లో 16వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. టీవీలో ఎంతో కామ్‌గా, జెంటిల్‌మెన్‌గా కనిపించిన ముఖేష్ గౌడ.. బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ఉంటారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. బిగ్ బాస్ స్టేజ్‌పై డ్యాన్స్‌తో ఆకట్టుకున్న ఆయన, తన వ్యక్తిత్వంతోనూ మెప్పించారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తాను జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, సీరియల్స్‌లో నటిస్తూ ప్రస్తుతం సినిమా హీరోగా ఎదిగానని చెప్పారు. తాను సింగిల్ అని వెల్లడిస్తూ, తన గత ప్రేమ గురించి కూడా కొన్ని విషయాలను పంచుకున్నారు.
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీకి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ను ఎందుకు వదిలేశారనే విషయంపై ముఖేష్ గౌడ క్లారిటీ ఇచ్చారు. సినిమా అవకాశాల కోసం సీరియల్‌ను వదిలేశారని, దర్శకుడితో విభేదాలు వచ్చాయని అప్పట్లో పలు ప్రచారాలు జరిగినప్పటికీ అవన్నీ నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. 2023లో ‘గీత శంకరం’ అనే తెలుగు సినిమాలో నటించేందుకు సిద్ధమైన సమయంలో సీరియల్‌తో పాటు సినిమా షూటింగ్ కూడా కొనసాగిందని చెప్పారు. అయితే నవంబర్‌లో వర్కౌట్స్ చేస్తుండగా బరువులు ఎత్తే సమయంలో బ్యాలెన్స్ తప్పి కిందపడటంతో వెన్నుకు తీవ్ర గాయం అయిందన్నారు. ఎంఆర్ఐలో డిస్క్‌కు గాయం అయినట్లు తేలడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని, ఆ కారణంగానే సీరియల్‌ను కొనసాగించలేకపోయానని ముఖేష్ గౌడ వెల్లడించారు. దర్శకుడితో గొడవ లేదా సినిమా కోసం సీరియల్‌ను వదిలేశారన్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!