

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 10 ‘దశావతారం’ గ్రాండ్ లాంచ్ ప్రోమో విడుదలైంది. మూడు నిమిషాల నిడివితో ఉన్న ఈ ప్రోమోలో పదో సీజన్‌లో ఉండబోయే కాన్సెప్ట్, సర్‌ప్రైజ్‌లకు సంబంధించిన అంశాలను పరిచయం చేశారు. హోస్ట్ నాగార్జునతో పాటు ఓ రోబో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బిగ్‌బాస్ ఇంట్లో కేవలం తెలివితేటలు, లెక్కలు, డేటా మాత్రమే కాకుండా.. ఎమోషన్స్‌తో అల్లుకున్న చిక్కులు కూడా కీలకమని నాగార్జున చెప్పడం ద్వారా ఈ సీజన్ గేమ్ ఎలా ఉండబోతోందో ప్రోమోలో శాంపిల్‌గా చూపించారు. పదో సీజన్‌కు గుర్తుగా 10 పవర్స్ ఉంటాయని నాగార్జున స్పష్టం చేశారు. కామనర్ కంటెస్టెంట్ల ముఖాలను ప్రోమోలో రివీల్ చేయగా.. సెలబ్రిటీ కంటెస్టెంట్ల ముఖాలను మాత్రం సస్పెన్స్‌లో ఉంచారు.
సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ జరగనుంది. ప్రోమోలో రైతు బిడ్డ ఝాన్సీ ఎంట్రీని కూడా చూపించారు. అంతేకాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో బిగ్‌బాస్ షోలు ఒకే రోజు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా భాషల హోస్టులు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, మోహన్‌లాల్ నాగార్జునతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. గ్రాండ్ లాంచ్‌లో కార్తీ, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. తొలి రోజే 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టనుండగా.. వారిలో ఆరుగురు కామనర్స్, 10 మంది సెలబ్రిటీలు ఉన్నారు. ‘ఈసారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్’ అనే కాన్సెప్ట్‌తో విడుదలైన ప్రోమో సీజన్‌పై మరింత ఆసక్తిని పెంచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!