
క్రీడలు

బిగ్‌బాస్ తెలుగు 10లో తొలి హౌస్‌మేట్స్ ఎవరో తేలిపోయింది. నాలుగో రోజు జరిగిన మొదటి టాస్క్‌లో రోహిత్, వంశీ విజయం సాధించి ఈ సీజన్‌లో తొలి హౌస్‌మేట్స్‌గా నిలిచారు. ఈసారి కంటెస్టెంట్లంతా టాస్కుల్లో గెలిచి హౌస్‌మేట్ హోదాను సంపాదించుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగానే బిగ్‌బాస్ మొదటి టాస్క్‌ను నిర్వహించాడు.
ఈ టాస్క్‌లో రెడ్ టీమ్ నుంచి రోహిత్, వంశీ.. బ్లూ టీమ్ నుంచి త్రిగుణ్, ముఖేష్ పోటీ పడ్డారు. ఇచ్చిన ఆల్ఫాబెట్లను ఉపయోగించి తమ టీమ్‌లోని ఎవరిని డేంజర్ జోన్‌లోకి పంపాలనుకుంటున్నారో వారి పేరును పేర్చాల్సి వచ్చింది. బ్లూ టీమ్ ముందుగా టాస్క్ పూర్తి చేసినప్పటికీ స్పెల్లింగ్ తప్పుగా ఉండటంతో రెడ్ టీమ్ విజయం సాధించింది. దీంతో రోహిత్, వంశీ హౌస్‌మేట్స్‌గా మారారు. ఈ విజయం గేమ్‌లో వారికి కీలకమైన ముందడుగుగా మారనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!