

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు పదో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈసారి మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. వీరిలో తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు సామాన్యులు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈసారి దశావతారం కాన్సెప్ట్‌తో షోను సరికొత్తగా రూపొందిస్తున్నట్లు సమాచారం. గత సీజన్లలో చూసిన టాస్కులు, గేమ్స్‌కు భిన్నంగా కొత్త తరహా సవాళ్లను కంటెస్టెంట్లకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో హౌస్‌లో గేమ్ ఎలా సాగుతుంది, కంటెస్టెంట్లు ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. సీజన్ 10 ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!