1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?

Writer: Pooja 09:59 AM, 1 సెప్టెంబర్, 2026
సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10 సెప్టెంబర్‌ 6న సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్ల ఎంపిక, కొత్త టాస్కులు, మార్పులపై సోషల్‌ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి సామాన్యులకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. కొందరి కథనాల ప్రకారం ఆరుగురు కామన్‌ మ్యాన్‌, మరో ఆరుగురు సెలబ్రిటీలను తీసుకోనున్నారని, మరికొన్ని నివేదికలు తొమ్మిది మంది సెలబ్రిటీలతో పాటు ఆరుగురు సామాన్యులు హౌస్‌లోకి వెళ్లనున్నారని చెబుతున్నాయి. అయితే అసలు లెక్క ఏమిటన్నది సెప్టెంబర్‌ 6న మాత్రమే తేలనుంది.

కామన్‌ మ్యాన్‌ కేటగిరీలో హౌస్‌లోకి వెళ్లే వారికి కూడా ఈసారి భారీ పారితోషికం దక్కనున్నట్లు సమాచారం. ‘అగ్నిపరీక్ష’ ద్వారా టాస్కుల్లో ప్రతిభ చూపించి ఎంపికైన ఆరుగురికి వారానికి సుమారు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు రెమ్యునరేషన్‌ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కామన్‌ మ్యాన్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్‌, కళ్యాణ్‌ పడాల, డెమోన్‌ పవన్‌, ఆదిరెడ్డి, ప్రియా శెట్టి తదితరులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలువురు టెలివిజన్‌ కార్యక్రమాలు, సీరియళ్లలో అవకాశాలు కూడా అందుకున్నారని ప్రచారం ఉంది.

ఈసారి ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన వారిలో అమన్‌ మసూద్‌, అపూర్వ, ఝాన్సీ, శాలిని, గాయత్రి, చరణ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఝాన్సీ అగ్నిపరీక్షలో చూపిన ప్రదర్శనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ, ఆమె టైటిల్‌ రేసులో ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో పల్లవి ప్రశాంత్‌, కళ్యాణ్‌ పడాల వంటి కామన్‌ మ్యాన్‌ కంటెస్టెంట్లు టైటిల్‌ గెలుచుకోవడంతో ఈసారి కూడా సామాన్యులే ట్రోఫీని అందుకుంటారా అనే ఆసక్తి నెలకొంది. అయితే కంటెస్టెంట్ల తుది జాబితా, వారి పారితోషికాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్

బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌

బిగ్ బాస్ సీజన్ 10లో సరికొత్త ట్విస్ట్.. ఈసారి గేమ్ మామూలుగా ఉండదట!

బిగ్ బాస్ సీజన్ 10లో సరికొత్త ట్విస్ట్.. ఈసారి గేమ్ మామూలుగా ఉండదట!

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10కామన్ మ్యాన్ కంటెస్టెంట్లుఅగ్నిపరీక్షబిగ్‌బాస్ తెలుగుతెలుగు టెలివిజన్రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్
సినిమాలు

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్

బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు
జనరల్

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు

తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
జనరల్

తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

బంగారం ధరలు మరింత పతనం
బిజినెస్

బంగారం ధరలు మరింత పతనం

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?
షోస్

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి
జనరల్

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

మరో తమిళ సినిమాలో కింగ్ ?
గాసిప్స్

మరో తమిళ సినిమాలో కింగ్ ?

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?
సినిమాలు

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!