

కన్నడకు చెందిన నటి చైత్ర రాయ్ బిగ్ బాస్ తెలుగు 10లో 6వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది. సొంత భాషలో నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె సీరియళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ‘అష్టా చమ్మా’ సీరియల్‌తో తెలుగు టెలివిజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘రాధా కళ్యాణం’, ‘ఒక్క క్షణం’, ‘తథాస్తు’ తదితర సీరియళ్లలో నటించింది. ‘అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు’ సీరియల్‌లో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
చైత్ర రాయ్ సీరియళ్లకే పరిమితం కాకుండా సినిమాల్లోనూ నటించింది. ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘దేవర’లో సహాయ పాత్రలో కనిపించింది. వ్యక్తిగత జీవితంలో ప్రసన్నను వివాహం చేసుకున్న చైత్రకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె చిన్న కుమార్తెకు ప్రస్తుతం 10 నెలల వయసు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన చైత్ర.. తన ప్రతిభ, గ్లామర్, బోల్డ్ అండ్ స్ట్రెయిట్‌ఫార్వర్డ్ వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!