

ముఖేష్ గౌడ బిగ్ బాస్ తెలుగు 10లో 16వ, చివరి కంటెస్టెంట్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ‘రైరై రారా’ అంటూ అదిరిపోయే స్టెప్పులతో హౌస్‌లోకి అడుగుపెట్టారు. తన జర్నీ గురించి మాట్లాడుతూ తాను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చానని, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత సీరియల్స్, సినిమాల్లో హీరోగా ఎదిగినట్లు చెప్పారు. అక్కినేని నాగార్జునతో జరిగిన సంభాషణలో తనలోని హ్యూమరస్ యాంగిల్‌ను ఇప్పటివరకు ప్రేక్షకులు పూర్తిగా చూడలేదని, బిగ్ బాస్ హౌస్‌లో దానిని అందరికీ చూపిస్తానని తెలిపారు. తాను ఇంకా సింగిల్‌గానే ఉన్నానా అని నాగార్జున సరదాగా ప్రశ్నించగా.. తాను అన్‌లక్కీ అంటూ ముఖేష్ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది.
హౌస్‌లోకి వెళ్లే ముందు తెలుగు ఇండస్ట్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ముఖేష్ గౌడ భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు ఇండస్ట్రీ తనకు అన్నం పెట్టిందని, తెలుగులో ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరారు. తెలుగు తన నాలుకపై మాత్రమే కాకుండా గుండెల్లో ఉందని చెప్పడం ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నారు. కన్నడ నటుడైన ముఖేష్ గౌడ.. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో రిషి పాత్రతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కన్నడ చిత్రాల్లో హీరోగా నటించడంతో పాటు తెలుగులోనూ కొన్ని ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. ట్రావెలింగ్, ట్రెక్కింగ్ అంటే కూడా ఆయనకు ఆసక్తి ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టిన ముఖేష్.. ఈ షో ద్వారా ఎలాంటి ఇమేజ్‌ను సొంతం చేసుకుంటారో, ఎంతకాలం తన ప్రయాణాన్ని కొనసాగిస్తారో ఆసక్తిగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!