

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 10వ సీజన్‌ను అంగరంగ వైభవంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ‘దశావతారం’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ‘బిగ్ బాస్ 10’ ఈ రోజు (ఆదివారం) రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు, శని, ఆదివారాల్లో వీకెండ్ స్పెషల్ ఎపిసోడ్లు రాత్రి 9:00 గంటలకు ప్రసారం కానున్నాయి.
గత కొన్ని సీజన్లుగా రాత్రి 10:00 గంటలకు ప్రసారమైన ‘బిగ్ బాస్’ను ఉద్యోగులు, ఫ్యామిలీ ఆడియన్స్ ఆలస్యంగా చూడాల్సి వచ్చేది. అయితే ఈసారి తిరిగి రాత్రి 9:30 గంటల ప్రైమ్ టైమ్‌ను కేటాయించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. 2017లో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్, 2018లో నాని హోస్ట్ చేసిన రెండో సీజన్ కూడా రాత్రి 9:30 గంటలకే ప్రసారమై మంచి టీఆర్‌పీ రేటింగ్స్ సాధించాయి. వరుసగా ఎనిమిదోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున ఈ సీజన్‌ను మరింత గ్రాండ్‌గా నడిపించేందుకు సిద్ధమయ్యారు. ‘అగ్నిపరీక్ష’ వేదిక ద్వారా ఎంపికైన ఆరుగురు కామనర్లతో పాటు 10 మంది సెలబ్రిటీలు కలిపి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. కొత్త టైమింగ్స్, వినూత్న కాన్సెప్ట్, సెలబ్రిటీల సందడితో ‘బిగ్ బాస్ 10’ బుల్లితెరపై సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!