

‘బిగ్ బాస్ 10’ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో నిర్వాహకులు చాలా ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. గత మూడు సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు కామనర్లు కంటెస్టెంట్లుగా పాల్గొంటున్నారు. ‘అగ్నిపరీక్ష’ ద్వారా కొందరు బలమైన కామనర్లను ఎంపిక చేయగా, మరోవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్లను కూడా సిద్ధం చేశారు. పెద్దగా ప్రయోగాలకు వెళ్లకుండా ప్రేక్షకులకు ఇప్పటికే కొంత పరిచయం ఉన్న సెలబ్రిటీలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం.
తాజా సీజన్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడుతున్నారు. వీరిలో 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లు ఉన్నారు. పరిచయం ఉన్న ముఖాలతో పాటు అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన సామాన్యులను కలిపి సమతూకమైన కంటెస్టెంట్ లైనప్‌ను రూపొందించారు. ఈ కలయిక హౌస్‌లో విభిన్నమైన కంటెంట్‌కు అవకాశం కల్పించడంతో పాటు ప్రేక్షకుల్లో మొదటి నుంచే ఆసక్తిని పెంచేలా కనిపిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!