

అగ్నిపరీక్షలో బిగ్ బాస్ 10 టికెట్ గెలుచుకున్న సింగర్ ఝాన్సీ.. హౌస్‌లోకి మూడో కంటెస్టెంట్‌గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రాగానే తన కాన్ఫిడెన్స్‌ను చూపించింది. అగ్నిపరీక్షలో టికెట్ గెలిచానని, ఇప్పుడు బిగ్ బాస్ ట్రోఫీ కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది. తన బిగ్ బాస్ ప్రయాణాన్ని పాట రూపంలో వివరిస్తూ.. అగ్నిపరీక్షలో ఎదుర్కొన్న సవాళ్లు, టికెట్ గెలిచిన క్షణాలను పాటలో చెప్పింది. ఈ సీజన్ తనదే అన్నట్లుగా ఆమె మాటలు వినిపించాయి.
నాగార్జున్‌తో మాట్లాడుతూ మూడో ఏట నుంచే పాటలు పాడుతున్నానని, తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తూ పెరిగానని ఝాన్సీ తన నేపథ్యాన్ని వివరించింది. అనంతరం హౌస్‌లోకి వెళ్లిన ఆమెను త్రిగుణ్, దేబ్జానీ పలకరించారు. కెప్టెన్ రూమ్‌ను చూసిన వెంటనే తానే కెప్టెన్ అవుతానన్నట్లుగా ఝాన్సీ ధీమాగా మాట్లాడింది. ఆ తర్వాత త్రిగుణ్, దేబ్జానీ, ఝాన్సీ, సుధీర్‌లకు నాగార్జున్ టాస్క్ ఇచ్చారు. ఇందులో టాప్-2లో నిలిచిన వారికి మ్యాజిక్ కీలు లభిస్తాయని తెలిపారు. టాస్క్‌లో త్రిగుణ్ మొదటి స్థానంలో, ఝాన్సీ రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఇద్దరికీ మ్యాజిక్ కీలు దక్కాయి. మరి ఝాన్సీ తన కాన్ఫిడెన్స్‌కు తగ్గట్టుగా గేమ్ ఆడి విజేతగా నిలుస్తుందా? తొలి వారంలోనే కెప్టెన్ అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!