

‘బిగ్ బాస్ తెలుగు’ మైలురాయి సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్‌కు కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తొలి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ తన ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో ఆకట్టుకోగా, రెండో సీజన్‌లో హీరో నాని తన సహజమైన శైలితో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన నాగార్జున తనదైన స్టైల్, టైమింగ్, హుందాతనంతో ‘బిగ్ బాస్’కు పర్యాయపదంగా మారారు. ఓటీటీ ఎడిషన్‌తో పాటు వరుస సీజన్లను విజయవంతంగా నడిపించిన నాగార్జున, తాజా సీజన్‌ను ఎలా నడిపించనున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
తాజా సీజన్ ‘దశావతారం’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ప్రారంభమైంది. ‘స్టార్ మా’, ‘జియో హాట్‌స్టార్’లో ప్రసారమవుతున్న ఈ షో సెలబ్రిటీలు, కామనర్ కంటెస్టెంట్లతో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. “ఈసారి ఆటలో సవాల్ కాదు...ఆటే సవాల్” అనే ట్యాగ్‌లైన్‌తో కొత్త సీజన్‌పై మరింత ఆసక్తిని పెంచింది. నాగార్జున హోస్టింగ్, వినూత్న కాన్సెప్ట్‌తో ఈ సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!