

జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ రామ్ ప్రసాద్ బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి వెళ్లకముందే హోస్ట్ అక్కినేని నాగార్జున అతడికి ఓ ప్రత్యేకమైన టాస్క్ ఇచ్చారు. ఇప్పటికే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లను రామ్ ప్రసాద్‌కు చూపించి, వారి ఆడియోను మ్యూట్ చేశారు. కంటెస్టెంట్ల సైగలు, చూపులు, హావభావాలను గమనించి.. వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో ఎంటర్టైనింగ్గా చెప్పాలని నాగార్జున సూచించారు. దీంతో రామ్ ప్రసాద్ తనదైన శైలిలో ఝాన్సీ, త్రిగుణ్, దేబ్జానీ తదితరుల గురించి వారి ‘ఇన్నర్ వాయిస్’ను చెప్పే ప్రయత్నం చేశాడు.
అయితే రామ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తనను అంతగా ఎంటర్టైన్ చేయలేదంటూ నాగార్జున సరదాగా షాక్ ఇచ్చారు. నిన్ను ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో తీసుకున్నామని, పెర్ఫార్మెన్స్ ఇలాగే ఉంటే బయటకు పంపిస్తానని అన్నారు. దీనికి రామ్ ప్రసాద్ కూడా తనదైన కామెడీ టైమింగ్‌తో స్పందిస్తూ.. తనను కామెడీ చేయమని చెప్పి, నాగార్జునే తనతో కామెడీ చేస్తున్నారంటూ పంచ్ వేశాడు. చివరకు నాగార్జున రామ్ ప్రసాద్‌ను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించారు. లోపలికి వెళ్లిన తర్వాత త్రిగుణ్, సుధీర్లతో మాట్లాడుతూ.. ఈ షో కోసం తాను బరువు తగ్గానని, అందరికీ గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చానని చెప్పాడు. జబర్దస్త్‌తో పాటు ఇతర టెలివిజన్ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ ప్రసాద్.. బిగ్ బాస్‌లో ఎలాంటి ఆట ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!