

టాలీవుడ్ నటుడు వంశీ కృష్ణ, ‘టెంపర్’ వంశీగా గుర్తింపు పొందిన ఆయన, బిగ్ బాస్ తెలుగు 10లో 9వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా ‘టెంపర్’తో గుర్తింపు తెచ్చుకున్న వంశీ.. ఆ తర్వాత లోఫర్, కాటమరాయుడు, పైసా వసూల్, భరత్ అనే నేను, బ్లఫ్ మాస్టర్, డిస్కో రాజా, భీష్మ, వకీల్ సాబ్, పుష్ప: ది రైజ్, సర్కారు వారి పాట, హిట్: ది సెకండ్ కేస్, టైగర్ నాగేశ్వరరావు, డబుల్ ఇస్మార్ట్, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పలు చిత్రాల్లో నటించాడు.
రఫ్ అండ్ టఫ్ లుక్, విలన్ పాత్రల్లో తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో వంశీ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినిమాల్లో కనిపించే తన ఇమేజ్‌కు భిన్నమైన కోణాన్ని చూపిస్తాడా అనే ఆసక్తి నెలకొంది. ఆఫ్ స్క్రీన్‌లో వంశీ ఎలా ఉంటాడు? తనలోని ఎంటర్టైనింగ్, వ్యక్తిగత కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసి ఆకట్టుకుంటాడా? అనేది అతని బిగ్ బాస్ ప్రయాణంలో చూడాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!