

తెలుగు ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ ప్రస్తుతం ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో విష్ణుప్రియ కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో బిగ్‌బాస్ తెలుగు, సామాన్యులను హౌస్‌లోకి తీసుకురావడానికి నిర్వహిస్తున్న ‘అగ్నిపరీక్ష’ గురించి ఆమెను ప్రశ్నించారు.
దీనిపై విష్ణుప్రియ స్పందిస్తూ.. తాను బిగ్‌బాస్‌లోకి వెళ్లిన సమయంలో సామాన్యులను ఎంపిక చేసేందుకు అగ్నిపరీక్ష లాంటి కార్యక్రమాలు ఏవీ లేవని గుర్తుచేశారు. అయినప్పటికీ బిగ్‌బాస్ తనకు చాలా కష్టమైన అనుభవంగా అనిపించిందని, దేవుడి దయ వల్ల ఆ షోను పూర్తి చేయగలిగానని చెప్పారు. మరోవైపు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో పలువురు సామాన్యులు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!