

క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త అందించింది. మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 2027 జనవరి 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు బంగ్లాదేశ్, నేపాల్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. మొత్తం 16 జట్లు 41 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్లు వేర్వేరు గ్రూపుల్లో పోటీ పడనున్నాయి. టీమిండియా జనవరి 22న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం జనవరి 24న నేపాల్‌తో, జనవరి 26న ఐర్లాండ్‌తో తలపడుతుంది. మరోవైపు పాకిస్థాన్ జనవరి 22న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. జనవరి 24న న్యూజిలాండ్‌తో, జనవరి 26న సమోవాతో పోటీ పడుతుంది. జనవరి 26తో గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగియనున్నాయి.
గ్రూప్ దశలో అర్హత సాధించిన జట్లు సూపర్-6 దశకు చేరుకుంటాయి. ఈ దశలో రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 4న చటోగ్రామ్‌లో సెమీఫైనల్స్ జరగనున్నాయి. సెమీఫైనల్స్‌కు ఫిబ్రవరి 5న, ఫైనల్‌కు ఫిబ్రవరి 7న రిజర్వ్ డే కేటాయించారు. ఫిబ్రవరి 6న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉండగా, 2027లో పురుషుల వన్డే ప్రపంచకప్ కూడా జరగనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దీంతో 2027లో క్రికెట్ అభిమానులకు వరుసగా కీలక టోర్నీలు కనువిందు చేయనున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!