

భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ఈ రోజు తన 26వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతని గురువు, టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో ఓ సరదా వీడియోను షేర్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. గతంలో మైదానంలో తొందరపడి అనవసర షాట్లు ఆడినప్పుడు అభిషేక్‌తో గుంజీలు తీయించిన సందర్భాలతో పాటు, ఇకపై అలాంటి తప్పులు చేయనని అతనితో మాట తీసుకున్న సరదా సన్నివేశాలు ఈ వీడియోలో కనిపించాయి.
ఈ సరదా క్షణాలతో పాటు అభిషేక్ ఆటతీరును, వ్యక్తిత్వాన్ని యువరాజ్ ప్రశంసించాడు. అందరితో ఆప్యాయంగా ఉంటూ మంచి నాయకుడిగా ఎదుగుతున్న తీరు తనకు ఎంతో నచ్చిందని చెప్పాడు. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రతిసారి మరింత కష్టపడే గుణమే అభిషేక్‌ను ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నాడు. భవిష్యత్తులో టీమిండియా తరఫున అభిషేక్ మరిన్ని పరుగులు సాధించాలని యువరాజ్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించాడు. ఈ ఫన్నీ బర్త్‌డే పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!