

అమెరికాలోని రెనోలో జరుగుతున్న ప్రపంచ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భద్రాచలానికి చెందిన డీవీ శంకరరావు రజత పతకం సాధించారు. ఇప్పటికే ఈ పోటీల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఆయన.. తాజాగా ఎక్విప్డ్ మాస్టర్స్-4 విభాగంలో 74 కిలోల కేటగిరీలో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. డెన్మార్క్‌కు చెందిన టెరాగ్ని స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. 73 ఏళ్ల వయసులో అంతర్జాతీయ స్థాయిలో శంకరరావు సాధించిన ఈ ఘనత భద్రాచలానికి గుర్తింపు తీసుకొచ్చింది.
శంకరరావు విజయానికి ఆయన జీవిత ప్రయాణం మరింత ప్రత్యేకతను జోడిస్తోంది. 14 ఏళ్ల క్రితం ఆయనకు గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. అయినప్పటికీ, 70 ఏళ్లు దాటిన తర్వాత పవర్‌లిఫ్టింగ్‌లోకి అడుగుపెట్టి పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు. వయసు, ఆరోగ్యపరమైన సవాళ్లను అధిగమించి ప్రపంచ వేదికపై రాణిస్తున్న ఆయన ప్రయాణం పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!