
సినిమాలు

మాజీ భారత క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్‌కు ఆస్ట్రేలియా మహిళల కమ్యూనిటీ క్రికెట్‌లో ఆడేందుకు అనుమతి లభించింది. ఈ నిర్ణయంపై అనయా సంతోషం వ్యక్తం చేసింది. ట్రాన్స్‌జిషన్ అనంతరం ఇకపై క్రికెట్ ఆడలేనేమోనని గతంలో ఆందోళన చెందానని, అయితే క్రికెట్ ఆస్ట్రేలియా మరో అవకాశం కల్పించిందని ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపిన వివరాల ప్రకారం, వచ్చే ఏడాది మార్చి వరకు ఆస్ట్రేలియాలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రీమియర్ క్రికెట్ పోటీల్లో అనయా పాల్గొనవచ్చు. అయితే పోటీల్లో పాల్గొనే ముందు ఆమె రక్త పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఆమె టెస్టోస్టిరాన్ స్థాయి ఉందో లేదో ఈ పరీక్ష ద్వారా పరిశీలించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!