

సరిగ్గా 16 ఏళ్ల క్రితం దిల్లీ కామన్వెల్త్ వేదికపై తండ్రి వల్లూరి శ్రీనివాసరావు పతకం సాధించగా.. ఇప్పుడు తనయుడు వల్లూరి అజయ్ బాబు గ్లాస్గో వేదికగా సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల అజయ్ బాబు పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించాడు. స్నాచ్‌లో 149 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 181 కిలోలతో మొత్తం 330 కిలోల బరువును ఎత్తాడు.
ఫైనల్లో మలేసియాకు చెందిన హిదాయత్ మహమ్మద్ 331 కిలోలతో స్వర్ణ పతకాన్ని దక్కించుకోగా, అజయ్ బాబు కేవలం ఒక్క కిలో తేడాతో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్ ముర్రే 325 కిలోలతో కాంస్యం సాధించాడు. అజయ్ తండ్రి శ్రీనివాసరావు 2010 దిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో 56 కేజీల విభాగంలో కాంస్యం సాధించగా, ఇప్పుడు కుమారుడు అంతర్జాతీయ వేదికపై పతకం సాధించి తండ్రి వారసత్వాన్ని కొనసాగించాడు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!