25, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏషియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ షెడ్యూల్‌ విడుదల

Writer: Pooja 01:51 PM, 25 అక్టోబర్, 2026
ఏషియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ షెడ్యూల్‌ విడుదల

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 19 నుంచి 29వ తేదీ వరకు ఖతార్ రాజధాని దోహాలో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ పోటీలను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-బిలో భారత్ ‘ఎ’, పాకిస్థాన్ ‘ఎ’, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్లు ఉన్నాయి. గ్రూప్-ఎలో శ్రీలంక ‘ఎ’, బంగ్లాదేశ్ ‘ఎ’, అఫ్గానిస్థాన్ ‘ఎ’, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో అందరి దృష్టిని ఆకర్షించే మ్యాచ్ భారత్ ‘ఎ’, పాకిస్థాన్ ‘ఎ’ జట్ల మధ్య జరగనుంది. నవంబర్ 22న దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ పోరు నిర్వహించనున్నారు.

భారత్ ‘ఎ’ జట్టు నవంబర్ 20న నేపాల్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత నవంబర్ 22న పాకిస్థాన్ ‘ఎ’తో తలపడనుండగా, నవంబర్ 24న యూఏఈతో గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఆడుతుంది. సింగిల్ రౌండ్-రాబిన్ విధానంలో జరిగే ఈ టోర్నీలో ప్రతి జట్టు తన గ్రూప్‌లోని మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. నవంబర్ 26, 27 తేదీల్లో సెమీఫైనల్స్ జరగనుండగా, నవంబర్ 29న ఫైనల్ నిర్వహించనున్నారు. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన పాకిస్థాన్ ‘ఎ’ జట్టు ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. భారత్–పాక్ యువ జట్ల పోరు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధోనీ ఐపీఎల్‌ 2027 ప్రయాణంపై వీడని సస్పెన్స్‌

ధోనీ ఐపీఎల్‌ 2027 ప్రయాణంపై వీడని సస్పెన్స్‌

భారత పారా అథ్లెట్ల ఘనతపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల హర్షం

భారత పారా అథ్లెట్ల ఘనతపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల హర్షం

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో అభిషేక్‌ శర్మ చరిత్ర

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో అభిషేక్‌ శర్మ చరిత్ర

ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి పీవీ సింధు..

ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి పీవీ సింధు..

న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ.. ఆసక్తికర విషయాలు చెప్పిన భువనేశ్వర్

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ.. ఆసక్తికర విషయాలు చెప్పిన భువనేశ్వర్

ట్యాగ్లు
ఏషియా కప్ రైజింగ్ స్టార్స్భారత్ ఎ జట్టుపాకిస్థాన్ ఎ జట్టుఏసీసీ క్రికెట్దోహా క్రికెట్ టోర్నీభారత్ పాకిస్థాన్ మ్యాచ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026.. నవంబర్ 22న భారత్-పాక్ పోరు!
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026.. నవంబర్ 22న భారత్-పాక్ పోరు!

దీపావళికి స్వదేశీ వస్తువులే కొనండి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు
జనరల్

దీపావళికి స్వదేశీ వస్తువులే కొనండి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు

ఫోన్ పక్కన పెట్టండి.. మైదానంలోకి రండి! యువతకు ధోనీ కీలక సూచన
క్రీడలు

ఫోన్ పక్కన పెట్టండి.. మైదానంలోకి రండి! యువతకు ధోనీ కీలక సూచన

వచ్చే వారం ఐదు ఐపీఓలు.. రూ.2,600 కోట్ల సమీకరణే లక్ష్యం!
బిజినెస్

వచ్చే వారం ఐదు ఐపీఓలు.. రూ.2,600 కోట్ల సమీకరణే లక్ష్యం!

తెలుగు కుర్రాళ్లు ఇరగదీశారు.. తిలక్ వర్మ, నితీశ్ రెడ్డిపై దినేశ్ కార్తీక్ ప్రశంసలు
క్రీడలు

తెలుగు కుర్రాళ్లు ఇరగదీశారు.. తిలక్ వర్మ, నితీశ్ రెడ్డిపై దినేశ్ కార్తీక్ ప్రశంసలు

యూరిక్ యాసిడ్, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? కివీ గురించి వైద్యులు చెప్పిన విషయాలివే!
ఆరోగ్యం

యూరిక్ యాసిడ్, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? కివీ గురించి వైద్యులు చెప్పిన విషయాలివే!

వీఐ ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్..
బిజినెస్

వీఐ ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్..

సాయిదుర్గా తేజ్ కొత్త సినిమాలో కాంతార బ్యూటీ?
గాసిప్స్

సాయిదుర్గా తేజ్ కొత్త సినిమాలో కాంతార బ్యూటీ?

నథింగ్ Phone (5) Pro, Phone (5) స్పెసిఫికేషన్లు లీక్..
టెక్నాలజీ

నథింగ్ Phone (5) Pro, Phone (5) స్పెసిఫికేషన్లు లీక్..

ఓటీటీలోకి ‘ఎస్ఐ యుగంధర్’!
ఓటీటీ

ఓటీటీలోకి ‘ఎస్ఐ యుగంధర్’!

ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం
జనరల్

ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 49 ప్రోమో 2: బిగ్‌బాస్‌ హౌస్ నుంచి దక్షి ఔట్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 49 ప్రోమో 2: బిగ్‌బాస్‌ హౌస్ నుంచి దక్షి ఔట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!