

భారత దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు సాధారణంగా బీసీసీఐ అధికారిక అంపైర్లు బాధ్యతలు నిర్వర్తిస్తారు. అయితే, ఈసారి ఆస్ట్రేలియాకు చెందిన బెన్ ట్రెలోర్ భారతదేశంలో రంజీ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేస్తుండటం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ మధ్య కుదిరిన పరస్పర సహకార కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా భారత అంపైర్ పరాశర్ జోషి కూడా ఆస్ట్రేలియాలో జరిగే దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేయనున్నారు.
ప్రస్తుతం గుజరాత్–దిల్లీ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు బెన్ ట్రెలోర్ అంపైర్‌గా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 26న ప్రారంభమయ్యే ముంబయి–హరియాణా మ్యాచ్‌కూ ఆయన అంపైరింగ్ చేయనున్నారు. మరోవైపు, పరాశర్ జోషి నవంబర్ 11 నుంచి 14 వరకు క్వీన్స్‌ల్యాండ్–టాస్మానియా జట్ల మధ్య జరిగే షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌కు, నవంబర్ 22 నుంచి 25 వరకు న్యూ సౌత్ వేల్స్–క్వీన్స్‌ల్యాండ్ పోరుకు అంపైర్‌గా వ్యవహరించనున్నారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఈ మార్పిడి కార్యక్రమం చేపట్టారు. వచ్చే బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో తొలి మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుందనే వార్త కూడా భారత్–ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాల్లో మరో ఆసక్తికర పరిణామంగా నిలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!