

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ జట్లు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్లో తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్థరాత్రి 12:30 గంటలకు న్యూయార్క్-న్యూజెర్సీ స్టేడియంలో ప్రారంభం కానుంది. వరుసగా రెండో ప్రపంచకప్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న అర్జెంటీనాకు లియోనెల్ మెస్సీ ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా, స్పెయిన్ రెండోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రతిష్ఠాత్మక ఫైనల్‌ను పలువురు అంతర్జాతీయ ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. అలాగే 2026 ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారిగా 48 దేశాల జట్లు పాల్గొన్న అతిపెద్ద ప్రపంచకప్‌గా నిలిచింది. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!