
జనరల్

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌పై యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో రోహిత్ తన ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించారని పేర్కొన్న గిల్, ఎక్కువసేపు తాను నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో నిలబడి ఆయన బ్యాటింగ్‌ను ఆస్వాదించానని చెప్పాడు. భారీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వికెట్లు కాపాడుకోవడమే కీలకమని తమ మధ్య చర్చ జరిగిందని వెల్లడించాడు.
పవర్‌ప్లేలో కొత్త బంతితో దూకుడుగా ఆడాలా లేదా అన్న దానిపై చర్చించామని, అయితే కొత్త బంతితో దాడి చేయడం అంత సులభం కాదని ఇద్దరికీ తెలుసని గిల్ వివరించాడు. రోహిత్ శర్మ ముందుగా ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మించుకుని, అనంతరం వేగం పెంచిన తీరు అసాధారణమని కొనియాడాడు. ముఖ్యంగా 60, 70 పరుగుల మార్క్ దాటిన తర్వాత ఆయన బ్యాటింగ్ చూడటం ఓ ప్రత్యేక అనుభూతిగా అనిపించిందని గిల్ వ్యాఖ్యానించాడు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!