
సినిమాలు

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఉత్కంఠభరిత విజయం సాధించింది. 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివర్లో నమన్ ధీర్ సిక్స్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు.
భారత బ్యాటర్లలో సంజు శాంసన్ 67 పరుగులతో రాణించగా, నమన్ ధీర్ 42, శ్రేయస్ అయ్యర్ 42, అక్షర్ పటేల్ 24, అభిషేక్ శర్మ 29 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ (1), తిలక్ వర్మ (6) నిరాశపరిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!