7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..

Writer: Chandrika 11:57 AM, 7 సెప్టెంబర్, 2026
జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో ఇండోనేసియాపై 14-0తో ఘన విజయం సాధించిన భారత పురుషుల జట్టు.. ఆదివారం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం తీవ్ర పోరును ఎదుర్కొంది. చివరి నిమిషంలో కెప్టెన్‌ అన్మోల్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్‌ 3-3తో డ్రా చేసుకుని ఓటమి నుంచి బయటపడింది. మ్యాచ్‌ నాలుగో నిమిషంలో అన్మోల్‌ పెనాల్టీ స్ట్రోక్‌తో భారత్‌కు తొలి గోల్‌ అందించగా.. 10వ నిమిషంలో అషు మౌర్య పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. అయితే 11వ నిమిషంలో రయుషిన్‌ ససాకి గోల్‌తో జపాన్‌ ఖాతా తెరిచింది. అనంతరం రెండు జట్లు గోల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరి క్వార్టర్‌లో నకనిషి 48వ, 59వ నిమిషాల్లో గోల్స్‌ చేసి జపాన్‌ను 3-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మ్యాచ్‌ ముగియడానికి 59 సెకన్ల ముందు భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను అన్మోల్‌ గోల్‌గా మలిచి స్కోరును సమం చేశాడు. భారత్‌ మంగళవారం కొరియాతో తలపడనుంది.

మరోవైపు మహిళల జూనియర్‌ ఆసియాకప్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 11-1తో ఘన విజయం సాధించింది. తొలి నిమిషం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు.. మ్యాచ్‌ ముగిసే వరకు అదే దూకుడును కొనసాగించింది. పూజ సాహో, పూర్ణిమ యాదవ్‌, గీత యాదవ్‌, సనిక మానె రెండేసి గోల్స్‌ సాధించారు. బినిమా ధాన్‌, కృష్ణ శర్మ, సుఖ్‌వీర్‌ కౌర్‌ ఒక్కో గోల్‌ చేశారు. మలేసియా తరఫున 38వ నిమిషంలో నూర్‌ మహ్మద్‌ ఏకైక గోల్‌ సాధించింది. భారీ విజయంతో భారత మహిళల జట్టు టోర్నీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

చెపాక్‌లో వైభవ్‌ సూర్యవంశీ మేనియా..

చెపాక్‌లో వైభవ్‌ సూర్యవంశీ మేనియా..

‘భారత్‌పై గెలుపు పాక్‌కు మేలు చేయలేదు’ - మహ్మద్ యూసుఫ్

‘భారత్‌పై గెలుపు పాక్‌కు మేలు చేయలేదు’ - మహ్మద్ యూసుఫ్

ట్యాగ్లు
జూనియర్‌ ఆసియాకప్‌ హాకీభారత హాకీభారత జూనియర్‌ హాకీభారత్‌ జపాన్‌ హాకీభారత్‌ మలేసియా హాకీమహిళల జూనియర్‌ హాకీపురుషుల జూనియర్‌ హాకీభారత హాకీ జట్టుహాకీ టోర్నమెంట్‌ఆసియా హాకీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్
బిజినెస్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్
జనరల్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?
టెక్నాలజీ

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...
జనరల్

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..
జనరల్

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం
జనరల్

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?
క్రీడలు

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?
క్రీడలు

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..

బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌
సినిమాలు

బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!