
జనరల్

ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) జూనియర్ వరల్డ్ కప్ రెండవ రోజున కూడా భారత షూటర్లు తమ అద్భుత ప్రదర్శనను కొనసాగించి, మూడు రజత పతకాలు, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. నిన్న జరిగిన పలు షూటింగ్ ఈవెంట్లలోనూ జట్టు తమ పతకాల పరంపరను కొనసాగించింది.
పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో రోహిత్ కన్యన్ రెండవ స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో సేజల్ కాంబ్లే కూడా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో రాజచంద్ర రజత పతకాన్ని గెలుచుకోగా, అభినవ్ దేశ్వాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!