26, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు

Writer: Harika S 11:20 PM, 25 అక్టోబర్, 2026
జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు

జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనను కొనసాగించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (126), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (106*) అద్భుత శతకాలతో చెలరేగడం, ఆ తర్వాత బౌలర్లు రాణించడంతో భారత్ 121 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

వడోదర వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ స్మృతి మంధాన (0), షఫాలీ వర్మ (8) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ప్రతీక రావల్ (61)తో కలిసి హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఆ తర్వాత దీప్తి శర్మ జత కలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మలు జింబాబ్వే బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి శతకాలతో కదం తొక్కారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

329 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు మంచి ఆరంభమే లభించింది. 20 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 104 పరుగులు చేసి పోరాడే సంకేతాలు ఇచ్చింది. ముపచిక్వా (49), తిరిపానో (46) రాణించారు. అయితే, ఆ తర్వాత భారత స్పిన్నర్లు విజృంభించారు. స్పిన్ త్రయం వైష్ణవి శర్మ, దీప్తి శర్మ, శ్రీ చరణి ధాటికి జింబాబ్వే బ్యాటర్లు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయారు. వైష్ణవి శర్మ 4 వికెట్లతో చెలరేగగా, బ్యాటింగ్‌లో సెంచరీతో మెరిసిన దీప్తి శర్మ బౌలింగ్‌లోనూ 3 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. దీంతో జింబాబ్వే జట్టు 48.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026.. నవంబర్ 22న భారత్-పాక్ పోరు!

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026.. నవంబర్ 22న భారత్-పాక్ పోరు!

ఫోన్ పక్కన పెట్టండి.. మైదానంలోకి రండి! యువతకు ధోనీ కీలక సూచన

ఫోన్ పక్కన పెట్టండి.. మైదానంలోకి రండి! యువతకు ధోనీ కీలక సూచన

తెలుగు కుర్రాళ్లు ఇరగదీశారు.. తిలక్ వర్మ, నితీశ్ రెడ్డిపై దినేశ్ కార్తీక్ ప్రశంసలు

తెలుగు కుర్రాళ్లు ఇరగదీశారు.. తిలక్ వర్మ, నితీశ్ రెడ్డిపై దినేశ్ కార్తీక్ ప్రశంసలు

ఏషియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ షెడ్యూల్‌ విడుదల

ఏషియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ షెడ్యూల్‌ విడుదల

ధోనీ ఐపీఎల్‌ 2027 ప్రయాణంపై వీడని సస్పెన్స్‌
ట్యాగ్లు
జింబాబ్వేఇండియామహిళ క్రికెట్ టీమ్సిరీస్ విన్దీప్తి శర్మస్మృతి మందనాషఫాలీ వర్మ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ధోనీ ఐపీఎల్‌ 2027 ప్రయాణంపై వీడని సస్పెన్స్‌

భారత పారా అథ్లెట్ల ఘనతపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల హర్షం

భారత పారా అథ్లెట్ల ఘనతపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల హర్షం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గౌరీ పూర్తిగా నా కంట్రోల్ లో ఉండాలని భావించేవాడ్ని: షారుఖ్ ఖాన్
సినిమాలు

గౌరీ పూర్తిగా నా కంట్రోల్ లో ఉండాలని భావించేవాడ్ని: షారుఖ్ ఖాన్

రజనీకాంత్ 'ధర్మన్'లో నయనతార
సినిమాలు

రజనీకాంత్ 'ధర్మన్'లో నయనతార

ఇరాన్ నేతలను చంపడం ఆపాలి - డొనాల్డ్ ట్రంప్
జనరల్

ఇరాన్ నేతలను చంపడం ఆపాలి - డొనాల్డ్ ట్రంప్

రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్
జనరల్

రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్

జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు
క్రీడలు

జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు

రష్మికకు మద్దతుగా జావేద్ అక్తర్
సినిమాలు

రష్మికకు మద్దతుగా జావేద్ అక్తర్

ఫ్లిప్‌కార్ట్ పార్శిల్‌లో విక్రయదారుడి నుంచి ఓ వింత లేఖ
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్ పార్శిల్‌లో విక్రయదారుడి నుంచి ఓ వింత లేఖ

సింగరేణి బలోపేతానికి సమగ్ర ప్రణాళిక - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

సింగరేణి బలోపేతానికి సమగ్ర ప్రణాళిక - డిప్యూటీ సీఎం భట్టి

ప్రధానిపై ఖర్గే వ్యాఖ్యలు.. మండిపడుతున్న బీజేపీ
రాజకీయాలు

ప్రధానిపై ఖర్గే వ్యాఖ్యలు.. మండిపడుతున్న బీజేపీ

కుంటాలలో హార్వెస్టర్ బీభత్సం.. ముగ్గురికి గాయాలు
జనరల్

కుంటాలలో హార్వెస్టర్ బీభత్సం.. ముగ్గురికి గాయాలు

అక్టోబర్ 26న బ్యాంక్ సెలవు.. ఈ ఐదు నగరాల్లో శాఖలు బంద్!
జనరల్

అక్టోబర్ 26న బ్యాంక్ సెలవు.. ఈ ఐదు నగరాల్లో శాఖలు బంద్!

రాహుల్ గాంధీ ఓ ‘లాపతా నేత’.. తెలంగాణ హామీలు ఏమయ్యాయంటూ కేటీఆర్ ప్రశ్నలు
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఓ ‘లాపతా నేత’.. తెలంగాణ హామీలు ఏమయ్యాయంటూ కేటీఆర్ ప్రశ్నలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!