

ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నేపథ్యంలో ప్రముఖ నటుడు మోహన్‌లాల్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. స్టేడియంలో ప్రత్యక్షంగా ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమని పేర్కొన్న ఆయన, స్పెయిన్, అర్జెంటీనా జట్లు అత్యున్నత స్థాయి ఆటను ప్రదర్శించాయని కొనియాడారు. టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన కనబర్చిన స్పెయిన్‌కు అభినందనలు తెలియజేశారు.
ఫుట్‌బాల్ ప్రపంచాన్ని సరిహద్దులు, విభేదాలకు అతీతంగా ఒక్కటిగా నిలబెట్టే క్రీడ అని మోహన్‌లాల్ అభిప్రాయపడ్డారు. మెస్సీకి వీరాభిమాని అయిన ఆయన, అర్జెంటీనా ఆడిన దాదాపు అన్ని మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ ఫైనల్‌కు హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా హాజరయ్యారు. బాలీవుడ్ నటి కరీనా కపూర్ స్పెయిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, లామిన్ యమాల్ మెస్సీని హత్తుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!