

భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించారు. గ్లెన్ ఫిలిప్స్ అజేయ అర్ధశతకంతో అదరగొట్టాడు. 81 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫిన్ అలెన్ 45 పరుగులు చేయగా, జాకబ్స్ 31, డారిల్ మిచెల్ 28, టిమ్ సీఫర్ట్ 24 పరుగులతో రాణించారు. దీంతో టీమిండియా ముందు న్యూజిలాండ్ 226 పరుగుల కఠిన లక్ష్యాన్ని ఉంచింది.
మరోవైపు, భారత బౌలర్లు కివీస్ బ్యాటర్ల దూకుడును అడ్డుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్షర్ పటేల్ 51 పరుగులు సమర్పించుకోగా, అర్షదీప్ సింగ్ 45, మయాంక్ యాదవ్ 40, నితీశ్ కుమార్ రెడ్డి 40, భువనేశ్వర్ కుమార్ 49 పరుగులు ఇచ్చారు. అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు. తొలి టీ20లో విజయం సాధించాలంటే టీమిండియా 226 పరుగులు చేయాల్సి ఉంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!