6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్

Writer: Sreekanth Reddy 01:31 PM, 6 సెప్టెంబర్, 2026
ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్

మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా నిన్న‌ భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే, ఈ ఓటమి తర్వాత పాక్ మహిళల జట్టు కోచ్ వహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాలను విస్తుపోయేలా చేశాయి. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడినప్పటికీ, ఈ టోర్నీలో తమ జట్టే అత్యుత్తమమైనదని ధీమా వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, భారత బౌలర్ల ధాటికి కేవలం 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు మునీబా అలీ, షావల్ జుల్ఫికర్ మినహా మరే బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో శ్రీ చరణి 3, దీప్తి శర్మ 2, ప్రేమ రావత్ 2 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు. అనంతరం 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన వహాబ్ రియాజ్.. "మా జట్టులోని క్రీడాకారిణులంతా ఎంతో నైపుణ్యం ఉన్నవారు. వారు తమను తాము నమ్మాలి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన తప్పులపై చర్చిస్తాం. వాటిని పునరావృతం చేయకుండా చూసుకుంటాం. ఈ ఆసియా కప్‌లో ట్రోఫీ గెలవడానికి పాకిస్థానే అత్యుత్తమ జట్టు అని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు మాకు బాగా అనుకూలిస్తాయి" అని వ్యాఖ్యానించాడు.

జట్టు కూర్పు విషయంలో కోచ్ వహాబ్ రియాజ్‌తో కెప్టెన్ సనా మీర్ పూర్తిగా విభేదించింది. ఆసియా కప్ కోసం ఏకంగా 7 మంది క్రీడాకారిణులను జట్టు నుంచి తొలగించడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కెప్టెన్ వ్యాఖ్యలపై వహాబ్ రియాజ్ స్పందిస్తూ.. "అది సనా మీర్ వ్యక్తిగత అభిప్రాయం. దానితో నాకు సంబంధం లేదు. మేము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేశాం. గతంలో ఆడిన అమ్మాయిలు ఎన్నో ప్రపంచకప్‌లు, ఆసియా కప్‌లు ఆడినా ఫలితాలు రాలేదు. అందుకే కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చి, రాబోయే టోర్నమెంట్ల కోసం జట్టును నిర్మించాల్సిన సమయం వచ్చింది" అని స్పష్టం చేశాడు.

జట్టు నుంచి తొలగించిన క్రీడాకారిణులు అస్సలు రాణించడం లేదని, అందుకే కొత్తవారికి అవకాశం ఇవ్వడమే సరైన నిర్ణయమని గట్టిగా సమర్థించుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై తప్పనిసరిగా గెలవాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్ప‌డింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు

ట్యాగ్లు
ఆసియా కప్ 2026ఇండియాపాక్క్రికెట్బీసీసీఐఐసీసీపీసీబీవహాబ్ రియాజ్‌సనా మీర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక

పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

  ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు
జనరల్

ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ
జనరల్

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్
రాజకీయాలు

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా
జనరల్

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా

ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ
జనరల్

ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ

హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా
జనరల్

హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్
జనరల్

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్

తెలంగాణలో ఈవీ ఛార్జింగ్‌కు భారీ బూస్ట్
జనరల్

తెలంగాణలో ఈవీ ఛార్జింగ్‌కు భారీ బూస్ట్

విపక్షాలపై  ప్రధాని  మోదీ విమర్శలు
రాజకీయాలు

విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు