1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాకిస్ధాన్ క్రికెట్ లో భారీ ప్రక్షాళన

Writer: Sreekanth Reddy 08:31 AM, 1 సెప్టెంబర్, 2026
పాకిస్ధాన్ క్రికెట్ లో భారీ ప్రక్షాళన

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఎదురైన ఘోర పరాజయాల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రక్షాళన చర్యలకు ఉపక్రమించింది. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన వెంటనే, సిరీస్ మధ్యలోనే జట్టులో సమూల మార్పులు చేపట్టింది. ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడంతో పాటు, రెడ్-బాల్ కోచింగ్ సిబ్బందిపై కూడా వేటు వేసింది.

వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్, పరిమిత ఓవర్ల క్రికెట్ మాజీ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో పాటు అలీ ఉస్మాన్, అమీర్ జమాల్, ముహమ్మద్ అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్‌లను జట్టు నుంచి విడుదల చేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. వీరి స్థానంలో ఏడుగురు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసింది. వీరిలో సైమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్‌లకు టెస్ట్ అనుభవం ఉండగా, అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహమ్మద్ ఇమ్రాన్, రజావుల్లాలకు తొలిసారిగా టెస్ట్ జట్టులో చోటు లభించింది.

ఆటగాళ్లపైనే కాకుండా కోచింగ్ సిబ్బందిలోనూ మార్పులు చేసింది. టెస్ట్ క్రికెట్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను బాధ్యతల నుంచి తప్పించింది. వారి స్థానంలో ఈ పర్యటన ముగిసే వరకు వైట్-బాల్ కోచ్ మైక్ హెసన్, యాష్లే నోఫ్కేలకు అదనపు బాధ్యతలు అప్పగించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్థాన్ ఇప్పటికే 0-2తో వెనుకబడగా.. ఆటగాళ్ల పేలవ ఫామ్, గాయాల వివాదాలే ఈ మార్పులకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు సెప్టెంబర్ 9న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానుంది.  

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ

ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ

వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బరిలో లక్ష్య, సాత్విక్ జోడీ

వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బరిలో లక్ష్య, సాత్విక్ జోడీ

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..

మహిళల ఛాంపియన్స్ ట్రోఫీపై ఉత్కంఠ.. భారత్‌లో జరిగితే పాక్ పరిస్థితి ఏంటి?

మహిళల ఛాంపియన్స్ ట్రోఫీపై ఉత్కంఠ.. భారత్‌లో జరిగితే పాక్ పరిస్థితి ఏంటి?

దులీప్ ట్రోఫీ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు..

దులీప్ ట్రోఫీ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు..

ట్యాగ్లు
ఐసీసీక్రికెట్పాకిస్తాన్పీసీబీబాబర్ అజీమ్ఇంగ్లాండ్ సిరీస్లార్డ్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...
క్రీడలు

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్
ఓటీటీ

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు
జనరల్

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు

ఎంపీ ల్యాడ్స్ ఖర్చులో తెలుగు ఎంపీల వెనుకడుగు
రాజకీయాలు

ఎంపీ ల్యాడ్స్ ఖర్చులో తెలుగు ఎంపీల వెనుకడుగు

స్టార్ సినిమాలకు చిక్కులు?
సినిమాలు

స్టార్ సినిమాలకు చిక్కులు?

‘వారణాసి’ డిజిటల్ హక్కులపై ఆచితూచి అడుగులు?
సినిమాలు

‘వారణాసి’ డిజిటల్ హక్కులపై ఆచితూచి అడుగులు?

ఇరుముడి మూవీపై దిల్ రాజు ప్రశంసలు
సినిమాలు

ఇరుముడి మూవీపై దిల్ రాజు ప్రశంసలు

రవితేజ లాగే బాలయ్య, నాగ్ ఆ మైలు రాయి అందుకుంటారా?
సినిమాలు

రవితేజ లాగే బాలయ్య, నాగ్ ఆ మైలు రాయి అందుకుంటారా?

ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ
క్రీడలు

ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ

రవితేజ తదుపరి చిత్రంలో క్రేజీ హీరోయిన్లు?
సినిమాలు

రవితేజ తదుపరి చిత్రంలో క్రేజీ హీరోయిన్లు?

‘కల్కి 2’ పరిస్థితి ఏంటి?
సినిమాలు

‘కల్కి 2’ పరిస్థితి ఏంటి?

పాకిస్ధాన్ క్రికెట్ లో భారీ ప్రక్షాళన
క్రీడలు

పాకిస్ధాన్ క్రికెట్ లో భారీ ప్రక్షాళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!