

టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అద్భుతమైన రికార్డు ఉంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన జడేజా, ముఖ్యంగా ఎల్బీడబ్ల్యూ ద్వారా వికెట్లు సాధించడంలో తనదైన ముద్ర వేశాడు. అయితే డీఆర్ఎస్ విషయంలో మాత్రం అతడి ఇటీవలి రికార్డు చర్చనీయాంశంగా మారింది. గత మూడేళ్లలో జడేజా 22 రివ్యూలు తీసుకోగా, 18 విఫలమయ్యాయి. మరో నాలుగు అంపైర్స్ కాల్‌గా ముగిశాయి.
జడేజా చివరిసారిగా 2023లో తీసుకున్న రివ్యూ విజయవంతమైనట్లు సమాచారం. ఆ తర్వాత నుంచి అతడు తీసుకున్న రివ్యూల్లో విజయం దక్కలేదు. దీంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డీఆర్ఎస్ తీసుకునే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. గతంలో ఆటగాళ్లు ఒత్తిడి చేసినప్పటికీ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూల విషయంలో ఆచితూచి వ్యవహరించేవాడు. జడేజా ఇప్పటివరకు 90 టెస్టుల్లో 4,117 పరుగులు చేసి 352 వికెట్లు సాధించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!