
క్రీడలు

పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్‌లో రాబోయే ఫిఫా ప్రపంచ కప్‌నే చివరి ప్రపంచకప్‌గా ఆడనున్నట్లు స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఇది తన చివరి ప్రపంచకప్ అని తెలుసుకుని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
రేపటి మ్యాచ్ తనకు చివరిది కాకూడదని ఆశిస్తున్నానని రొనాల్డో అన్నారు. సరదాగా స్పందిస్తూ, "అలా అయితే నన్ను విమర్శించే వాళ్లు ఇంకొంతకాలం నన్ను విమర్శించే అవకాశం ఉంటుంది" అని వ్యాఖ్యానించారు. తన చివరి ప్రపంచకప్‌ను చిరస్మరణీయంగా మార్చుకోవాలనే సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!