21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో రోహిత్, కోహ్లీ కి డిమోషన్

Writer: Venkatesh 03:46 PM, 20 జనవరి, 2026
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో రోహిత్, కోహ్లీ కి డిమోషన్

టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ నుంచి ఊహించని పరిణామం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. 2026–27 సీజన్‌కు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్టుల్లో మార్పులు చేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ మార్పుల పై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ప్రధానంగా ప్రస్తుతం అమలులో ఉన్న ‘ఏ ప్లస్’ కేటగిరీని పూర్తిగా తొలగించి, మూడు గ్రేడ్‌లకే పరిమితం కావాలని కమిటీ సూచించినట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ ఆమోదం లభిస్తే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఇప్పటికే రోహిత్, కోహ్లీ టెస్టులు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఒకే ఫార్మాట్‌లో ఆడుతున్న కారణంగా వారిని ఏ ప్లస్ కేటగిరీ నుంచి ‘బీ గ్రేడ్’కు తగ్గించే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లు ఏడాదికి రూ.7 కోట్ల వేతనం పొందుతున్నారు.

అయితే ఏ ప్లస్ గ్రేడ్ రద్దయితే, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలను ‘గ్రేడ్ ఏ’లోకి మార్చే అవకాశముందని చర్చ జరుగుతోంది. ఈ అంశం పై తుది నిర్ణయం త్వరలో జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ఏ ప్లస్ గ్రేడ్ తొలగింపు తర్వాత కొత్తగా ‘డీ గ్రేడ్’ను ప్రవేశపెడతారా అనే అంశంపైనా చర్చ సాగుతోంది. గతంలో ఫాస్ట్ బౌలర్ల కోసం ప్రత్యేక కాంట్రాక్టులను బీసీసీఐ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నేషనల్ క్రికెట్ అకాడమీ పరిధిలో ఉండే యువ బౌలర్లకు ఈ విధమైన కాంట్రాక్టులు ఇచ్చింది. ఇదే తరహాలో మరో కొత్త విధానం తీసుకొస్తారా అనే దాని పై స్పష్టత రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

రోహిత్–కోహ్లీపై స్పష్టత కోరిన యువరాజ్

రోహిత్–కోహ్లీపై స్పష్టత కోరిన యువరాజ్

సింధు విజయం.. రాజమౌళి రిప్లై వైరల్

సింధు విజయం.. రాజమౌళి రిప్లై వైరల్

స్ట్రైక్ ఏషియా టైటిల్ భారత్‌దే

స్ట్రైక్ ఏషియా టైటిల్ భారత్‌దే

స్పెయిన్ విజయంపై మోహన్‌లాల్ స్పందన

స్పెయిన్ విజయంపై మోహన్‌లాల్ స్పందన

గోల్డెన్ బాల్‌తో చరిత్ర సృష్టించిన రోడ్రి

గోల్డెన్ బాల్‌తో చరిత్ర సృష్టించిన రోడ్రి

ట్యాగ్లు
రోహిత్‌ శర్మవిరాట్‌ కోహ్లీబీసీసీఐసెంట్రల్‌ కాంట్రాక్టులుటీమ్ ఇండియా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫార్మర్ ఐడీపై ప్రభుత్వం అలర్ట్!
జనరల్

ఫార్మర్ ఐడీపై ప్రభుత్వం అలర్ట్!

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్
బిజినెస్

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని
జనరల్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ
జనరల్

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక

నీట్ వివాదంతో పార్లమెంట్ స్తంభనం
జనరల్

నీట్ వివాదంతో పార్లమెంట్ స్తంభనం

ఆస్పత్రి నుంచే పోరాటం కొనసాగిస్తా - వాంగ్‌చుక్
జనరల్

ఆస్పత్రి నుంచే పోరాటం కొనసాగిస్తా - వాంగ్‌చుక్

వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక
జనరల్

వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం
జనరల్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ
సినిమాలు

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!