
జనరల్

ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో అర్జెంటీనాను 1-0తో ఓడించిన స్పెయిన్ విశ్వవిజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవాలన్న అర్జెంటీనా ఆశలకు స్పెయిన్ అడ్డుకట్ట వేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత స్పెయిన్ ఆటగాళ్లు విజయోత్సవాల్లో మునిగితేలగా, కెప్టెన్ లియోనెల్ మెస్సీ తీవ్ర నిరాశతో మైదానంలోనే కూర్చుని కనిపించాడు. అదనపు సమయంలో వచ్చిన ఏకైక గోల్‌తో స్పెయిన్ విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో పరెడెస్ స్పెయిన్ ఆటగాళ్లు ఎరిక్ గార్సియా, గావి వద్దకు వెళ్లి దూకుడుగా ప్రవర్తించినట్లు సమాచారం. అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు వారిపై దాడికి యత్నించాడని, దీంతో రిఫరీ అతనికి రెడ్ కార్డ్ చూపించాడు. రెండో అర్ధభాగంలో కూడా పరెడెస్ అనవసర ఘర్షణలకు దిగిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!