
బిజినెస్

ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనాపై 1-0తో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ జట్టు విజయోత్సవాలు అనూహ్యంగా విషాదంలో ముగిశాయి. సలమాంకా ప్రావిన్స్‌లోని సియుడాడ్ రోడ్రిగోలో ఉన్న చారిత్రక ఆర్బోల్ గోర్డో ఫౌంటెన్ వద్ద అభిమానులు భారీగా చేరుకుని సంబరాలు జరుపుకుంటుండగా, ఫౌంటెన్లోని ఒక భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై సియుడాడ్ రోడ్రిగో మున్సిపల్ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం మొత్తం ఆనందంలో మునిగిపోయిన రోజే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని పేర్కొంటూ, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచకప్ విజయోత్సవాలను ఈ ఘటన పూర్తిగా విషాదంలోకి నెట్టిందని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (1)
Very Sad..😒